ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగికి అదిరిపోయే కానుక!
- ఇటీవల ముంబయిలో ఘటన
- రైలు పట్టాలపై జారిపడిన చిన్నారి
- అటుగా వస్తున్న రైలు
- పట్టాలపై పరుగులు తీసి చిన్నారిని కాపాడిన షెల్కే
- జాతీయ స్థాయిలో రియల్ హీరోగా గుర్తింపు
- ఇప్పటికే రూ.50 వేల నగదు అందించిన రైల్వేశాఖ
తాజాగా, ఈ రియల్ హీరోకు మరో బంపర్ గిఫ్ట్ లభించింది. జావా మోటార్ సైకిల్స్ సంస్థ ఓ జావా బైక్ ను కానుకగా అందించింది. షెల్కే వీరోచిత చర్య తర్వాత జావా మోటార్ సైకిల్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా ఓ బైక్ ఇస్తానని ప్రకటించారు. చెప్పినట్టుగానే జావా 42 మోడల్ బైక్ ను అతడికి ప్రదానం చేశారు. జావా సిబ్బంది స్వయంగా షెల్కే నివాసానికి వెళ్లి మరీ బండిని అప్పగించడం విశేషం.