ఇది మేము సాధించిన అసాధారణ విజయం: బైడెన్
- అమెరికాలో అనుకున్న లక్ష్యానికి వ్యాక్సినేషన్ పూర్తయింది
- 200 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ
- అప్రమత్తంగా లేకపోతే వైరస్ మళ్లీ ఈ పురోగతిని దెబ్బతీస్తుంది
కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం 100 రోజుల్లో 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకుని, నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు. దీంతో ఆ లక్ష్యాన్ని 200 మిలియన్ డోసులకు పెంచి, ఆ లక్ష్యాన్ని కూడా గడువులోగానే సాధించారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను అక్కడ ఎక్కువగా వేస్తున్నారు.