పండగ రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన 'ఆదిపురుష్'

22-04-2021 Thu 10:12
  • ప్రభాస్ తొలి పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్'
  • ఆయన కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం
  • విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం
Prabhas fans are disappointed
ప్రభాస్ ప్రధాన పాత్రధారిగా ఓంరౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' సినిమా రూపొందుతోంది. రామాయణ కథాకావ్యాన్ని ఈ టైటిల్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్ర కోసం కృతి సనన్ ను తీసుకున్నారు. ఇక ప్రతినాయక పాత్ర అయిన రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ప్రభాస్ చేస్తున్న తొలి పౌరాణిక చిత్రం ఇది. అత్యంత భారీ బడ్జెట్ తో .. ఇంతకుముందు తెరపై చూడని అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు.  

నిన్న 'శ్రీరామనవమి' కావడంతో ఈ సినిమా నుంచి శ్రీరాముడిగా ప్రభాస్ ఫస్టులుక్ రావొచ్చునని అభిమానులు భావించారు. సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ ల పోస్టర్ ను రిలీజ్ చేయవచ్చని మరికొంతమంది ఆశించారు. సీతారాములతో పాటు హనుమంతుడి పాత్రను కూడా రివీల్ చేయవచ్చని కొందరు అనుకున్నారు. ఇలా రకరకాల ఊహాగానాలతో నిన్నటి రోజున అంతా ఎదురుచూశారు. కానీ ఈ సినిమా టీమ్ నుంచి అలాంటి అప్ డేట్ ఏదీ రాలేదు. దాంతో ప్రభాస్ అభిమానులంతా చాలా నిరాశ పడ్డారు. సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.