Corona Virus: దేశంలో మ‌రో 2,95,041 మందికి కరోనా నిర్ధారణ

India reports 295041 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న‌ కొత్త‌గా 2,95,041 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,67,457 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,56,16,130 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,023 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,82,553కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,32,76,039 మంది కోలుకున్నారు. 21,57,538 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,01,19,310 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 27,10,53,392 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,39,357 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News