రైలు పట్టాలపై పడిన చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు నగదు బహుమతి
- ముంబయిలో రైలు పట్టాలపై పడిపోయిన చిన్నారి
- ప్రాణాలకు తెగించి పట్టాలపైకి దూకిన మయూర్ షెల్కే
- పాపను కాపాడిన వైనం.. వైరల్ అయిన వీడియో
- షెల్కేను అభినందించిన అధికారులు
ముంబయి నగరంలోని రైల్వే కార్యాలయానికి విచ్చేసిన మయూర్ షెల్కేకు తొలుత అదరిపోయే స్వాగతం లభించింది. అధికారులు, సిబ్బంది కరతాళ ధ్వనులతో అతడికి స్వాగతం పలికారు. అనంతరం రైల్వే డివిజనల్ మేనేజర్ షెల్కేకు రూ.50 వేల నగదు అందజేశారు.