YS Jagan: చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM Jagan wishes opposition leader Chandrababu on his birthday
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • నేటితో 71 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు
  • నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలన్న సీఎం జగన్
  • టీడీపీ ఆఫీసులోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నేడు 72వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. "చంద్రబాబునాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో  మీరు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

అటు, చంద్రబాబు జన్మదినం సందర్భంగా అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోనూ, విజయవాడలోని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆఫీసులోనూ వేడుకలు నిర్వహించారు. పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, టీడీ జనార్దన్, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పార్టీ నేత నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
YS Jagan
Chandrababu
Birthday
TDP
Andhra Pradesh

More Telugu News