అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎంకు శస్త్రచికిత్స
- తీవ్ర కడుపునొప్పికి గురైన సీఎం పళనిస్వామి
- చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిక
- వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది
- హెర్నియాతో బాధపడుతున్నట్టు గుర్తింపు
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి సీఎం పళనిస్వామి తన స్వగ్రామంలోనే ఉన్నారు. ఆదివారం చెన్నై చేరుకున్న ఆయన రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశం సందర్భంగా ఆరోగ్యంగానే కనిపించిన సీఎం... ఆ తర్వాత కడుపునొప్పితో బాధపడ్డారు. కాగా, ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా లేదని నిర్ధారణ అయింది. అనంతరం హెర్నియా శస్త్రచికిత్స నిర్వహించారు.