చిక్కుల్లోపడే సినిమా డైరెక్టర్ గా సుధీర్ బాబు!
- ఇంద్రగంటితో మూడో సినిమా
- రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే కథ
- కథానాయికగా అందాల కృతి శెట్టి
తాజాగా ఆయన ఇంద్రగంటి దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి టైటిల్ ను ప్రకటించగానే యూత్ లో ఆసక్తి పెరిగింది. ఆ అమ్మాయి కృతి శెట్టి అనేసరికి ఇక ఈ సినిమా పైనే కుర్రాళ్లంతా పూర్తి దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది.
ఈ సినిమాలో సుధీర్ బాబు .. సినిమా డైరెక్టర్ పాత్రలో కనిస్తాడట. ఆయన ఒక సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఆయన చుట్టూ కొన్ని సరదా సంఘటనలు జరుగుతాయి. వాటిని లైట్ తీసుకున్న ఆయన ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? తిరిగి ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే కథ అని అంటున్నారు.
ఈ మొత్తం సీన్లో ఆ అమ్మాయి కారణంగా ఆయన సమస్యల్లో పడ్డాడా? లేదంటే ఆమె అతణ్ణి బయటపడేసిందా? అనేదే సస్పెన్స్ గా అనిపిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.