Uttar Pradesh: జీవితంలో తొలిసారి ఓటేయలేకపోయిన ములాయంసింగ్ యాదవ్

  • ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ములాయం
  • ఓటు వేసేందుకు రావొద్దని కోరిన కుటుంబ సభ్యులు
  • నిన్న ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికలు
UP panchayat polls Mulayam Singh Yadav misses voting due to COVID

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ జీవితంలో తొలిసారి ఓటువేయలేకపోయారు. ఆయన స్వగ్రామమైన సైఫాయి గ్రామంలో నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ములాయం ఓటు వేసేందుకు వస్తానని చెప్పినా కరోనా నేపథ్యంలో రావొద్దని కోరామని, ఇందుకు ఆయన అంగీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం 81 ఏళ్ల ములాయం ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేశారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఓటు వేసేందుకు సైఫాయి రావొద్దని నేతాజీ (ములాయం)ని కోరామని, అదృష్టవశాత్తు అందుకాయన అంగీకరించారని ములాయం మేనల్లుడు  ధర్మేంద్రయాదవ్ తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో సోమవారం రెండోదశ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 20 జిల్లాల్లో 2.23 లక్షల స్థానాల కోసం 3.48 లక్షల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

More Telugu News