America: కొన్ని రోజులు భారత్ వెళ్లడాన్ని మానుకోండి.. తమ పౌరులకు అమెరికా సూచన

Postpone your India visit US urges their citizens
  • వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో పౌరులను అప్రమత్తం చేసిన అమెరికా
  • అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీడీసీ
  • ఇప్పటికే భారత పర్యటనను రద్దు చేసుకున్న బోరిస్ జాన్సన్
భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా తన పౌరులకు కీలక సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి నెమ్మదించే వరకు భారత పర్యటనకు దూరంగా ఉండాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి భారత పర్యటనను రద్దు చేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాత్రం ముందస్తుగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కోరింది. మరోవైపు, బ్రిటన్ కూడా భారత్‌ను తన ట్రావెల్ ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. ఈ నెల 25న భారత పర్యటనకు రావాల్సిన ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
America
Corona Virus
Travel
Britain
Boris Johnson

More Telugu News