రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్
- బ్యాటింగ్‌లో విఫలమైన రాజస్థాన్
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొయీన్ అలీ
- ఐపీఎల్‌లో ధోనీ సేనకు రెండో విజయం
అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. జోస్ బట్లర్ (49), రాహుల్ తెవాటియా (20), జయదేవ్ ఉనద్కత్ (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు. ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు కూడా సాధించలేకపోయారు.
చెన్నై బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొయీన్ అలీ 3 వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్, బ్రావో చెరో వికెట్ పడగొట్టారు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు ఇది రెండో ఓటమి కాగా, ధోనీ సేనకు ఇది రెండో విజయం. నేడు ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది.