నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి: తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం
- తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
- సర్కారు నిర్ణయం తీసుకోకుంటే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు
- అన్ని అంశాలు ప్రజలకు తెలిశాయన్న ధర్మాసనం
- ప్రభుత్వానికే తెలియాల్సి ఉందని వ్యాఖ్యలు
- తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా
బహిరంగ ప్రదేశాల్లో రద్దీ నియంత్రణ, ఎన్నికల సభలు, వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఓ కుటుంబం అంతా కరోనా బారినపడితే ఏవిధంగా సాయం చేస్తున్నారని అడిగింది. కరోనా బాధితులకు సత్వర చికిత్స అందేలా ఆర్టీపీసీఆర్ ఫలితం 24 గంటల్లోపే వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ సర్కారుకు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.