Actor Vivek: సినీ నటుడు వివేక్ పరిస్థితి విషమంగా ఉంది: వైద్యులు

Actor Vivek in critical condition says doctors
  • స్పృహ లేని స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారు 
  • యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ నిర్వహించాం
  • కరోనా వ్యాక్సిన్ వల్ల ఆయన అస్వస్థతకు గురి కాలేదు
ప్రముఖ తమిళ సినీ హాస్య నటుడు వివేక్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపారు.

స్పృహ లేని స్థితిలో ఈ ఉదయం 11 గంటలకు వివేక్ ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారని వెల్లడించారు. ఎమర్జెన్సీ గదిలో ఆయనకు వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఆ తర్వాత వివేక్ కు యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని... ఆయన పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

కాగా, ఆయనది కార్డియోజెనిక్ షాక్ తో కూడిన కరొనరీ సిండ్రోమ్ అని తెలిపారు. ఇది గుండెకు సంబంధించిన సమస్య అని... కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చినది కాకపోవచ్చని పేర్కొన్నారు. నిన్ననే వివేక్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం.
Actor Vivek
Tollywood
Kollywood
Health Bulletin

More Telugu News