'ఎవర్ గివెన్' నౌకకు రూ.7500 కోట్ల రూపాయల జరిమానా!
- గత నెల 23న సూయజ్ కెనాల్‌లో చిక్కుకుపోయిన నౌక
- నిలిచిపోయిన వందలాది నౌకలు
- జరిమానా చెల్లించేందుకు నిరాకరణ
- జప్తు చేసిన ఈజిప్టు ప్రభుత్వం
నౌకను అక్కడి నుంచి కదిలించి నౌకా రవాణాకు మార్గం సుగమం చేయడానికి అయిన ఖర్చు, నౌక నిలిచిపోవడం కారణంగా వాణిజ్యానికి జరిగిన నష్టం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ జరిమానా విధించింది. అయితే, ఈ జరిమానాను చెల్లించేందుకు నౌక యాజమాన్యం నిరాకరించడంతో ఈజిప్టు ప్రభుత్వం నౌకను జప్తు చేసింది. జరిమానాను చెల్లించే వరకు నౌకను తమ జలాల నుంచి కదలనివ్వబోమని స్పష్టం చేసింది.