కోలీవుడ్ హీరో కుమారజన్ ఆత్మహత్య!
- సొంతంగా సినిమా తీసిన కుమారజన్
- హిట్ కాకపోవడంతో నిరాశ
- ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య
నమక్కల్ లోని తన ఇంట్లోనే నటుడు, నిర్మాత కుమారజన్ నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో కుమారజన్ 'సొంతిప్పొమ్ సింతిప్పొమ్' పేరిట చిత్రాన్ని నిర్మించి, అదే సినిమాలో హీరోగానూ నటించారు. ఈ చిత్రం అంతగా హిట్ కాలేదు. దీంతో కొంతకాలంగా నిరాశలో కూరుకుపోయిన అతను, కెరీర్ సరిగ్గా సాగడంలేదని ప్రాణాలు తీసుకున్నట్టుగా సమాచారం.
కాగా, అతను ఉరేసుకున్న గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.