జూబ్లీహిల్స్ లో వ్యక్తి దారుణహత్య
- శివ అనే కూలీని తల పగులగొట్టి హత్య చేసిన వైనం
- స్నేహితుడిపైనే పోలీసుల అనుమానాలు
- నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి మందు తాగిన శివ
తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో శ్రీనివాస్ అక్కడకు వచ్చి చూడగా... శివ తల పగిలి, రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి, సమాచారం అందించాడు. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. హత్యలో అనుమానితుడిగా భావిస్తున్న డేవిడ్ కోసం గాలింపు చేపట్టారు.