చెన్నై జ‌ట్టు కెప్టెన్ ధోనీకి రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా!

11-04-2021 Sun 11:38
  • నిన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్-చెన్నై మ్యాచ్
  • చెన్నై సూపర్ కింగ్స్ స్లో ఓవ‌ర్ రేట్
  • ధోనీకి జ‌రిమానాతో స‌రిపెట్టిన నిర్వాహ‌కులు
dhoni fined 12 lakhs

నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమి పాలైన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో తొలి మ్యాచులోనే ఓట‌మిపాలై ఒత్తిడిలో ఉన్న చెన్నై జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి మ‌రో షాక్ త‌గిలింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ధోనీకి రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు.

ధోనీ చేసిన‌ తొలి త‌ప్పుగా దీనిని ప‌రిగ‌ణించి ఆయ‌న‌పై కేవ‌లం జ‌రిమానా వేసి వ‌దిలేశారు. కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో ధోనీ డ‌కౌటయ్యాడు. ధోనీ 2015లో ఐపీఎల్‌లో చెన్నై టీమ్ త‌ర‌ఫున ఆడి డ‌కౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ధోనీ డ‌కౌట్ కావ‌డం ఇదే తొలిసారి. నిన్న‌టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ టీమ్‌ సునాయాసంగా ఛేదించింది.