Thippeswamy: హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కన్నుమూత

Hindupuram ex mla thippeswamy passes away
  • 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా విశ్రాంత జీవనం
  • నివాళులు అర్పించిన మాజీ మంత్రి రఘువీరా

అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తిప్పేస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిగి మండలంలోని సేవ మందిరంలో ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

1978లో తొలిసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1947లో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సొంత స్థలంలో ఏఎం లింగన్న పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. తిప్పేస్వామి మృతి విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి తిప్పేస్వామి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News