Corona Virus: దేశంలో మ‌రో 1,45,384 మందికి కరోనా నిర్ధారణ

India reports 145384 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న ఒక్క రోజులో 1,31,968 మందికి కరోనా సోక‌గా, నిన్న  కొత్త‌గా 1,45,384 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 77,567 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 794 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  1,68,436 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,19,90,859 మంది కోలుకున్నారు.  10,46,631 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా  9,80,75,160 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,52,14,803 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,73,219 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News