IPL 2021: ఆసక్తికరంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్

IPL opening match between MI and RCB
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఓ మోస్తరు స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కీలక బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది.

క్రిస్ లిన్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 31, ఇషాన్ కిషన్ 28 పరుగులు చేశారు. రోహిత్ శర్మ (19), హార్దిక్ పాండ్య (13), పొలార్డ్ (7) నిరాశపరిచారు. బెంగళూరు బౌలర్లలో మీడియం పేసర్ హర్షల్ పటేల్ 5 వికెట్లు తీయడం హైలైట్. జేమీసన్, సుందర్ చెరో వికెట్ తీశారు.

ఇక లక్ష్యఛేదనలో బెంగళూరు జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లీ (20), గ్లెన్ మ్యాక్స్ వెల్ ఉన్నారు.
Go Back to Shorts
IPL 2021
Mumbai Indians
Royal Challengers Banglore
Chennai

More Telugu News