రాజన్న బిడ్డ మీ ముందుకు వచ్చింది... మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ
- ఖమ్మం జిల్లాలో షర్మిల పార్టీ సంకల్ప సభ
- హాజరైన వైఎస్ విజయమ్మ
- తండ్రి అడుగుజాడల్లో షర్మిల తెలంగాణకు వచ్చిందని వెల్లడి
- నాడు ఏప్రిల్ 9న చేవెళ్లలో పాదయాత్ర షురూ చేశారని వివరణ
- ఇప్పుడదే రోజున షర్మిల పార్టీ స్థాపిస్తోందని వ్యాఖ్యలు
"మాకు ఈ గడ్డతో సంబంధం తెగిపోలేదని చెప్పడానికే వచ్చాను. రాజశేఖర్ రెడ్డి గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజశేఖర్ రెడ్డిని నాయకుడిగా నిలబెట్టిన ప్రాంతం తెలంగాణ. అందుకే మా కుటుంబం మీకెప్పుడూ రుణపడి ఉంటుంది. నాడు రాజశేఖర్ రెడ్డి మిస్సింగ్ అంటూ వార్తలు రాగానే 700 వరకు గుండెలు ఆగిపోయాయి. రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికీ మీ హృదయాల్లో ఉంచుకున్నందుకు ఈ జన్మంతా మీకు రుణగ్రస్తులమై ఉంటాం. షర్మిలమ్మ ప్రతి యాత్రలోనూ మీరు అక్కున చేర్చుకుంటున్నారు. తెలంగాణతో నా జీవితం ముడిపడి ఉందమ్మా అని షర్మిలమ్మ చెప్పగానే ఎంతో సంతోషించాను. ఈ గడ్డతో మా అనుబంధం 40 ఏళ్లది. ఇప్పుడు షర్మిలమ్మ కారణంగా ఆ బంధం మరింత ముందుకు సాగనుంది" అంటూ పేర్కొన్నారు.