పవన్ కల్యాణ్ ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదు: తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్
- తిరుపతి పార్లమెంటు స్థానానికి ఈ నెల 17న ఎన్నికలు
- కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న చింతా మోహన్
- పవన్ ప్రచారం వృథా ప్రయాసగా మిగిలిపోతుందని వ్యాఖ్యలు
- ధరల పెరుగుదల బీజేపీ పతనానికి దారితీస్తుందని వెల్లడి
గతంలో కాంగ్రెస్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇప్పుడు బీజేపీ అలాంటి పరిస్థితినే చవిచూడబోతోందని చింతా మోహన్ పేర్కొన్నారు. దేశంలో ధరల పెరుగుదలకు బీజేపీనే కారణమని, అదే బీజేపీని పతనం దిశగా నడిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుంటే కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని స్పష్టం చేశారు.