Corona Virus: దేశంలో కొత్త‌గా 81,466 మందికి కరోనా నిర్ధారణ

India reports 81466 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో గ‌త 24 గంటల్లో 81,466 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 50,356 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 469 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,63,396కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,25,039 మంది కోలుకున్నారు. 6,14,696 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,87,89,138 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,59,12,587 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,13,966 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News