TDP: పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ సంచలన నిర్ణయం!

  • త్వరలో ఏపీలో పరిషత్ ఎన్నికలు
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
  • నిమ్మగడ్డ ఉన్నప్పుడే వైసీపీ రెచ్చిపోయిందని భావిస్తున్న టీడీపీ
  • ఆయన లేకుండా జరిగే ఎన్నికల్లో మరింత రెచ్చిపోతారని ఆందోళన
TDP decides to boycott Parishat elections in AP

రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని, అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే అధికార పార్టీ రెచ్చిపోయిందని, ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజార్చడం ఖాయం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్నీ తాజాగా ఎస్ఈసీగా రావడంతో టీడీపీ పరిషత్ ఎన్నికల సరళిపై ఓ అంచనాకు వచ్చింది.

More Telugu News