బీజేపీపై దుష్ప్రచారం కోసం మీ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ తెలివితేటలు ప్రదర్శించారా?: లోకేశ్ పై విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం

Vishnuvardhan Reddy comments on Nara Lokesh
  • పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు
  • బీజేపీ మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ అంశం ఉందన్న లోకేశ్
  • స్టేటస్ అంశం తమ మేనిఫెస్టోలో లేనేలేదని విష్ణు వెల్లడి
  • ఏప్రిల్ ఫూల్ కావాలనుకుంటున్నారా? అంటూ లోకేశ్ పై వ్యాఖ్యలు
పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని, ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా అంశం పుదుచ్చేరిలో ఎలా మొదలువుతుందో అని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.

ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయాలనుకున్నారా? లేక మీరే ఏప్రిల్ ఫూల్ కావాలనుకున్నారా? అని లోకేశ్ ను ప్రశ్నించారు. పుదుచ్చేరి మేనిఫెస్టోను బీజేపీ నాలుగు రోజుల కిందట ప్రకటించిందని, అందులో ఎక్కడా ప్రత్యేక హోదా అంశం లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ మీద దుష్ప్రచారం కోసం లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ తెలివితేటలు ప్రదర్శించారా? అని విమర్శించారు.
Go Back to Shorts
Vishnu Vardhan Reddy
Nara Lokesh
Stanford University
Puducherry
BJP

More Telugu News