Rana Daggubati: రానా సరసన కనువిందు చేయనున్న అందాల 'నిధి'

  • కెరియర్ ఆరంభంలో పరాజయాలు
  • 'ఇస్మార్ట్ శంకర్'తో దక్కిన భారీ హిట్
  • పవన్ సరసన 'హరిహర వీరమల్లు'
  • రానా జోడీగానూ అవకాశం?
Nidhi Agarwal got a chans with rana

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికలలో 'నిధి అగర్వాల్' ఒకరు. 'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, చక్కని కనుముక్కుతీరుతో యువకులను బుట్టలో పడేసింది.

ఇక ఆ తరువాత వచ్చిన 'మిస్టర్ మజ్ను' సినిమాతో ఈ అమ్మాయి కుర్రాళ్లకు కుదురు లేకుండా .. కునుకు లేకుండా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ పిల్ల గ్లామర్ కి మాత్రం గంపలకొద్దీ మార్కులు పడిపోయాయి. అందానికి అదృష్టం కూడా తోడైతే బాగుంటుందని ఈ సుందరి అనుకుంటున్న సమయంలోనే, 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ పడింది.

ఆ హిట్టే ఈ బ్యూటీని గట్టెక్కించింది .. ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఒక భారీ చారిత్రక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. 'హరిహర వీరమల్లు' టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. పిల్ల మంచి హైట్ కావడం వల్లనే ఈ ఛాన్స్ తగిలిందని అంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా రానా జోడీగా కూడా అవకాశాన్ని దక్కించుకుందని చెబుతున్నారు. ఒక సీనియర్ డైరెక్టర్ .. ఒక పెద్ద బ్యానర్లో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే అందాలనిధికి అదృష్టం కలిసొచ్చిందనే అనిపిస్తోంది.

More Telugu News