USA: అమెరికాలో మ‌రోసారి కాల్పులు.. న‌లుగురి మృతి

shooting in usa
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ సిటీలో ఓ వ్యక్తి కాల్పులు జ‌ర‌ప‌డంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి కూడా ఉంది. లికోయిన్‌ అవెన్యూ కార్యాల‌య‌ భవనం రెండవ అంతస్తులో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయ‌ని పోలీసులు చెప్పారు.

ఈ కాల్పుల గురించి స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసు అధికారులు ఓ అనుమానితుడిపై కాల్పులు జ‌ర‌ప‌గా అత‌డికి స్వల్ప గాయాల‌య్యాయి. అనంత‌రం అతడిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు అన్నారు. అమెరికాలో ప‌దే ప‌దే కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Go Back to Shorts
USA
shooting

More Telugu News