ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోబోం: బైడెన్, కమలా హ్యారిస్
- ఆసియన్ అమెరికన్లపై దాడులు సరికాదు
- వాటిని అరికట్టేందుకు న్యాయశాఖలో విభాగాన్ని ఏర్పాటు చేస్తాం
- పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నాం
అలాగే, ఈ విషయంపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా స్పందించారు. మనలో ఎవరికైనా హాని జరుగుతోందంటే అది మనందరికీ జరిగినట్లేనని ట్వీట్ చేశారు. ఇటువంటి హింస విషయంలో తాను, అధ్యక్షుడు బైడెన్ మౌనంగా ఉండబోమని చెప్పారు.
ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని కమలా హ్యారిస్ అన్నారు. కాగా, రెండు రోజుల క్రితం న్యూయార్క్‌లో ఆసియాకు చెందిన ఓ వృద్ధురాలిపై ఓ వ్యక్తి దారుణంగా దాడికి పాల్పడి ఆసియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే బైడెన్, కమల హ్యారిస్ స్పందించారు.