Corona Virus: దేశంలో కొత్త‌గా 53,480 మందికి కరోనా నిర్ధారణ

India reports 53480 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో గ‌త 24 గంటల్లో 53,480 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 41,280 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 354 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,468కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,34,301 మంది కోలుకున్నారు. 5,52,566 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,36,72,940 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,22,915 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News