Corona Virus: దేశంలో కొత్త‌గా 56,211 మందికి కరోనా

India reports 56211 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో గ‌త 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 37,028  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు. 5,40,720 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,26,50,025 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,85,864 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News