చిరంజీవి కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు?
- 'ఆచార్య'ను పూర్తిచేసే పనిలో చిరంజీవి
- అనంతరం సెట్స్ పైకి 'లూసిఫర్' రీమేక్
- బాబీ దర్శకత్వంలో గ్రామీణ కథాచిత్రం
- 'వీరయ్య' అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం
ఇక ఆ తర్వాత ఆయన మరో రెండు సినిమాలు చేయాల్సి వుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'వేదాళం' తమిళ చిత్రం రీమేక్ ఒకటి కాగా.. బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రం మరొకటి. అయితే, వీటిలో బాబీ సినిమానే ముందుగా సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని తెలుస్తోంది. దీని కోసం హీరో పాత్రను బట్టి ఈ చిత్రానికి 'వీరయ్య' అనే టైటిల్ని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలో వెల్లడవుతుంది.