JC Prabhakar Reddy: ఇకపై ఎవరికీ ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

We will give sufficient water to Tadpatri people says JC Prabhakar Reddy
  • తాడిపత్రి ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు
  • ప్రతిరోజు ఒక్కపూట పుష్కలంగా నీటిని అందిస్తాం
  • వైసీపీ నేతలు నన్ను జోకర్ అంటున్నారు

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి ప్రజలు తనను నమ్మి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలకు ప్రతిరోజు ఒక పూట పుష్కలంగా నీటిని అందిస్తామని చెప్పారు.

చిరు వ్యాపారుల నుంచి వైసీపీ నేతలు వసూళ్లకు పాల్పడటం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇకపై ఎవరికీ ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తోందని... అందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తనను జోకర్ అంటున్నారని... ఇది తనను ఎంతో బాధిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News