బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోదీ!
- రెండు రోజుల పాటు బంగ్లాలో పర్యటన
- కరోనా తరువాత తొలి విదేశీ పర్యటనలో ప్రధాని
- బంగ్లా అభివృద్ధికి సహకరిస్తానని హామీ
గత సంవత్సరం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత ఇంతవరకూ ప్రధాని దేశాన్ని దాటి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే. మహమ్మారి తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ, మోదీ తొలి విదేశీ పర్యటన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ నుంచి మొదలవుతోంది.