మా టీకాలో ఏ జంతువు పదార్థాలను వినియోగించలేదు.. స్పష్టం చేసిన ఆస్ట్రాజెనెకా
- ఇండోనేసియాలో వచ్చిన వదంతులపై స్పందన
- పందికి సంబంధించిన పదార్థాల్ని వాడలేదని స్పష్టం
- పునఃసమీక్షించి ఓకే చేసిన ఇండోనేసియా ఔషధ నియంత్రణ సంస్థ
దీనిపై ఆ దేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా స్పందించింది. వ్యాక్సిన్ తయారీలో పందికిగానీ లేదా ఇతర ఏ జంతువులతోనైనా సంబంధం ఉన్న పదార్థాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఈ టీకా వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇండోనేసియా ఔషధ నియంత్రణ సంస్థ ప్రయోగ ఫలితాల్ని మరోసారి సమీక్షించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించింది.