Vishnu Vishal: త్వరలో గుత్తా జ్వాల పెళ్లి... తేదీ ప్రకటిస్తామన్న విష్ణు విశాల్

  • ప్రేమలో ఉన్న జ్వాల, విష్ణు విశాల్
  • లాక్ డౌన్ సమయంలో నిశ్చితార్థం
  • అరణ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన విష్ణు
  • తాను తెలుగింటి అల్లుడ్నవుతున్నానని వెల్లడి
Vishnu Vishal announces marriage with Gutta Jwala

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. రానా నటించిన అరణ్య చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగ్గా నటుడు విష్ణు విశాల్ కూడా హాజరయ్యాడు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ కీలకపాత్ర పోషించాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపైనే విష్ణు విశాల్ తన పెళ్లి ప్రకటన చేశాడు. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని వెల్లడించాడు.

తాను తెలుగింటి అల్లుడ్ని కాబోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జ్వాల తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిందని తెలిపాడు. జ్వాల, విష్ణు విశాల్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుంది.

More Telugu News