జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి షూటింగ్... గాయపడిన రాయ్ లక్ష్మీ

Actress Raai Lakshmi got injured in midnight shooting in Hyderabad
  • షూటింగ్ కోసం హైదరాబాదులో ఉన్న రాయ్ లక్ష్మీ
  • యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం
  • ఒక్కసారిగా కిందపడిపోయిన రాయ్ లక్ష్మీ
  • మోకాలికి గాయం
  • ఆసుపత్రికి తరలించిన యూనిట్ సభ్యులు
టాలీవుడ్ అందాలభామ రాయ్ లక్ష్మీ షూటింగ్ లో గాయపడ్డారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి షూటింగ్ నిర్వహిస్తుండగా, రాయ్ లక్ష్మీ కిందపడిపోయారు. ఆమెపై ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె మోకాలికి గాయమైంది. వెంటనే స్పందించిన చిత్రయూనిట్ షూటింగ్ నిలిపివేసింది. రాయ్ లక్ష్మీని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Raai Lakshmi
Injury
Shooting
Hyderabad
Tollywood

More Telugu News