ఛేజింగ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్ల దూకుడు... 10 ఓవర్లలోనే 104 పరుగులు

20-03-2021 Sat 22:07
  • అహ్మదాబాద్ లో చివరి టీ20
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 రన్స్ చేసిన భారత్
  • ఛేజింగ్ లో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
  • విరుచుకుపడిన మలాన్, బట్లర్
England racing towards target in Ahmedabad
భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి టీ20కి ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ మైదానంలో పరుగులు పోటెత్తుతున్నాయి. భారత్ విసిరిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ దీటుగా స్పందించింది. తొలి ఓవర్లోనే జాసన్ రాయ్ డకౌట్ అయినా... డేవిడ్ మలాన్, జోస్ బట్లర్ ధాటిగా ఆడుతుండడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ జోడీ విజృంభణతో ఇంగ్లండ్ 10 ఓవర్లలోనే 104 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. బట్లర్ 51, మలాన్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 98 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లున్నాయి.