El Salvador: శిక్షణ సమయంలో ప్రమాదం.. సర్ఫింగ్‌ క్రీడాకారిణి మృతి

Salvadoran Surfer Dies
  • ఎల్‌ సాల్వడార్‌కు కేథరీన్‌ డియాజ్‌
  • ఎల్‌ తుంకో బీచ్‌లో లభ్యమైన మృతదేహం
  • అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సన్నద్ధం
  • డియాజ్‌ మృతి సర్ఫింగ్‌‌ జట్టుకు తీరని లోటు
సెంట్రల్‌ అమెరికా దేశమైన ఎల్‌ సాల్వడార్ జాతీయ సర్ఫింగ్‌‌ జట్టు క్రీడాకారిణి కేథరీన్ డియాజ్(22) మృతి చెందారు. శిక్షణ పొందుతున్న సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ తెలిపింది. దేశంలోని ఎల్‌ తుంకో బీచ్‌లో‌ ఆమె మృతదేహం బయటపడినట్లు పేర్కొంది.

 అంతర్జాతీయ సర్ఫింగ్ టోర్నమెంట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి డియాజ్ సన్నద్ధమవుతోందని సర్ఫింగ్‌ ఫెడరేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు యామిల్‌ బుకెల్‌ మాట్లాడుతూ.. ఆమె కుటుంబ  సభ్యులు, స్నేహితులకు సంతాపం తెలిపారు. డియాజ్‌ మృతి సర్ఫింగ్‌‌ జట్టుకు తీరని లోటని పేర్కొన్నారు.
El Salvador
Surfing
Sports

More Telugu News