Corona Virus: దేశంలో కొత్త‌ క‌రోనా కేసులు మళ్లీ 40 వేల‌కు మించి న‌మోదు!

India reports 40953 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌ క‌రోనా కేసులు మళ్లీ 40 వేల‌కు మించి న‌మోద‌య్యాయి. గ‌త‌ 24 గంట‌ల్లో 40,953 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 23,653 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,558కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,07,332  మంది కోలుకున్నారు. 2,88,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,20,63,392 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,24,31,517 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,60,971 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News