అమెరికాలో మరోసారి కాల్పుల క‌ల‌క‌లం.. ఎనిమిది మంది మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో మరోసారి కాల్పుల క‌ల‌క‌లం.. ఎనిమిది మంది మృతి

firing in usa
  • అట్లాంటాలోని మసాజ్‌ పార్లర్‌, స్పాల వ‌ద్ద‌ కాల్పులు
  • చోరీల‌కు పాల్ప‌డడానికి నిందితుడి య‌త్నం
  • అడ్డ‌గింపుతో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ వైనం
అమెరికాలో మరోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. గ‌త రాత్రి ఓ వ్య‌క్తి జ‌రిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... అట్లాంటాలోని మసాజ్‌ పార్లర్‌, స్పాల్లో గ‌త రాత్రి చోరీల‌కు పాల్ప‌డడానికి నిందితుడు రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ ప్ర‌య‌త్నించాడు.

దీంతో ఈ స‌మ‌యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న భ‌ద్ర‌తా సిబ్బంది అతడిని గుర్తించి, అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో అక్క‌డున్న వారిపై రాబ‌ర్ట్ కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. దీంతో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అత‌డి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలు ఉన్నారు. మొద‌ట అత‌డు రెండు స్పాల వ‌ద్ద, అనంత‌రం ఓ మసాజ్‌ సెంటర్‌ దగ్గర కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు.
USA
Crime News
firing

More Telugu News