Corona Virus: దేశంలో మ‌ళ్లీ పెరిగిపోతోన్న క‌రోనా కేసులు

India reports 28903 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న‌ క‌రోనా కేసుల సంఖ్య 24,492గా న‌మోదు కాగా, గ‌త‌ 24 గంట‌ల్లో 28,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,044 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,45,284  మంది కోలుకున్నారు. 2,34,406 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,50,64,536 మందికి వ్యాక్సిన్లు వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,92,49,784 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,69,021 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News