రెండేళ్లయింది.. వివేకా కేసు ఏమైంది?: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
- ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు
- నిందితులను గుర్తించలేదు, చార్జిషీటూ లేదు
- ఇలా చేస్తే వ్యవస్థలపై నమ్మకం పోతుంది
ఇలా చేయడం వల్ల పోలీసు వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిట్, సీబీఐలపై ప్రజలకు ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని తులసిరెడ్డి అన్నారు.