Rhea Chakraborty: బాలీవుడ్ నటి రియాకు బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎన్‌సీబీ

Rhea Chakrabortys bail challenged in the Supreme Court by NCB
  • డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి
  • గతేడాది అక్టోబరు 7న బెయిలు మంజూరు
  • ఎన్ఎస్‌బీ పిటిషన్‌పై 18న విచారణ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఈ కేసులో కొంతకాలంపాటు జైలులో ఉన్న రియాచక్రవర్తికి బాంబే హైకోర్టు గతేడాది అక్టోబరు 7న లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. అలాగే, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది.

రియా బెయిలును రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను ఎల్లుండి (18న) విచారిస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
Rhea Chakraborty
Bollywood
Drugs Case
NSB
Sushant Singh Rajput

More Telugu News