Sharmila: వివేకానంద రెడ్డి వ‌ర్థంతి కార్యక్రమం.. కూతురు సునీత‌తో క‌లిసి పాల్గొన్న విజ‌య‌మ్మ‌, షర్మిల‌

sharmila presents in viveka death anniversary program
షార్ట్స్‌లో చూడండి
క‌డ‌ప జిల్లా పులివెందులలో ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. పులివెందుల‌లో వివేకాఘాట్ వ‌ద్ద వైఎస్ కుటుంబ స‌భ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత‌తో పాటు వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కూడా పాల్గొన్నారు.

తెలంగాణ ష‌ర్మిల‌ కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. వ‌చ్చేనెల‌లోనే పార్టీ పేరు ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తుండ‌డం ప‌ట్ల ప‌లు ఊహాగానాలు వ‌స్తున్నాయి. కాగా, వివేకానందరెడ్డి 2019, మార్చి 15న పులివెందులలోని తన  ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించగా దానిపై విచార‌ణ కొన‌సాగుతోంది.
Go Back to Shorts
Sharmila
Kadapa District
YSRCP

More Telugu News