కృష్ణా జిల్లాలో ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురి దుర్మరణం
- తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురు
- నూజివీడు మండలంలోని గొల్లపల్లి వద్ద ఘటన
- బాధితులు నూజివీడు లయన్ తండాకు చెందిన కూలీలు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విజయవాడ, నూజీవీడు ఆసుపత్రులకు తరలించారు. బాధితులను నూజీవీడు లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.