తృణమూల్ తీర్థం పుచ్చుకున్న బెంగాల్ సినీ నటి సాయంతిక
- పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
- మార్చి 27 నుంచి 8 విడతల్లో పోలింగ్
- రాజకీయ పార్టీల్లో చేరుతున్న బెంగాల్ సినీ ప్రముఖులు
- సీనియర్ నేతల సమక్షంలో టీఎంసీలో చేరిన సాయంతిక
- టీఎంసీలో చేరడం గౌరవంగా భావిస్తున్నానని వెల్లడి
ఈ సందర్భంగా సాయంతిక మాట్లాడుతూ, తాను ఎప్పటినుంచో మమతా బెనర్జీకి అభిమానినని, అన్ని వేళలా ఆమె వెంట నడవాలని భావిస్తానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని, అందుకే టీఎంసీలోకి వచ్చానని వివరించారు. టీఎంసీలో చేరడాన్ని గౌరవంగా భావిస్తానని, పార్టీ ఆదేశాల ప్రకారం ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.
కాగా, ఇతర నటులు యష్, పాపియా, పాయల్ తదితరులు బీజేపీలో చేరగా, కంచన్ ముల్లిక్, సయోనీ ఘోష్ వంటి తారలు, దర్శకుడు రాజ్ చక్రవర్తి అధికార టీఎంసీ పక్షాన చేరారు.