Corona Virus: దేశంలో కొత్త‌గా 14,989 మందికి కరోనా నిర్ధారణ

India reports 14989 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,123 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 98 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,12,044  మంది కోలుకున్నారు. 1,70,126మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,56,20,749 మందికి వ్యాక్సిన్ వేశారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News