ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయ‌కండి: సినీ న‌టి సురేఖ వాణి కూతురు ఆగ్ర‌హం

02-03-2021 Tue 12:16
  • మిమ్మ‌ల్ని మీరు జ‌ర్న‌లిస్టుల‌మ‌ని చెప్పుకోవ‌ద్దు
  • మీ రెవెన్యూ కోసం న్యూస్ రాస్తున్నారు
  • ఇత‌రుల ప్ర‌తిష్ఠ‌ను, వారి కెరీర్‌ను దెబ్బ‌తీస్తున్నారు
supritha slams journalists

'ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయ‌కండి' అంటూ సినీ న‌టి సురేఖ వాణి కూతురు సుప్రిత త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేసింది. కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో సుప్రిత న‌టించింది. సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉంటూ త‌న ఫొటోల‌తో పాటు త‌న త‌ల్లి ఫొటోల‌ను కూడా పోస్ట్ చేస్తుంటుంది. అయితే, ఉన్న‌ట్టుండి ఆమె జ‌ర్న‌లిస్టుల‌పై మండిప‌డింది.
        
'ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయ‌కండి.. లేదంటే మీమ్మ‌ల్ని మీరు జ‌ర్న‌లిస్టుల‌మ‌ని చెప్పుకోవ‌డాన్ని, మీవి ప్రైమ్‌న్యూస్ చానెల్స్ అని చెప్పుకోవ‌డాన్ని ఆపేయాలి. మీ రెవెన్యూ కోసం ఇత‌రుల ప్ర‌తిష్ఠ‌ను, వారి కెరీర్‌ను దెబ్బ‌తీస్తున్నారు' అని ఆగ్రహం వ్య‌క్తం చేసింది.

ఇంతకీ దీనికి కారణం ఏమిటంటే.. ఇటీవ‌ల సురేఖ వాణి రెండో పెళ్లిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.  వాటిని సురేఖ‌ ఖండించింది కూడా. ఈ నేపథ్యంలోనే సుప్రిత ఇలా సంప్రదించింది.