India: దేశంలో కొత్త‌గా 16,488 మందికి క‌రోనా పాజిటివ్

India reports 16488 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 12,771 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 113 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,938కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,63,451 మంది కోలుకున్నారు. 1,59,590 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,42,42,547 మందికి వ్యాక్సిన్ వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,54,35,383 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,73,918 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News