Indian Railways: మెరుపు వేగంతో స్పందించి దివ్యాంగుడిని ర‌క్షించిన రైల్వే పోలీసు.. వీడియో ఇదిగో

  • మ‌హారాష్ట్ర‌లోని పాన్వెల్ రైల్వే స్టేష‌న్‌లో ఘ‌ట‌న
  • సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు
  • క‌దులుతోన్న రైలును ఎక్క‌బోయిన దివ్యాంగుడు
  • ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేసిన పోలీసు
Railway Protection Force personnel stopped a differentlyabled man from boarding a moving train

ఓ రైల్వే పోలీసు మెరుపు వేగంతో స్పందించి ఓ దివ్యాంగుడిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. మ‌హారాష్ట్ర‌లోని పాన్వెల్ రైల్వే స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.  రైలు క‌దులుతుండ‌గా ఓ దివ్యాంగుడు దాన్ని ఎక్క‌డానికి  ప్ర‌య‌త్నించాడు. ఆ స‌మయంలో రైలులోంచి ఓ వ్య‌క్తి  అత‌డిని ప‌ట్టుకుని రైల్లోకి లాగాల‌ని భావించాడు.

అయితే, రైలు వేగంగా క‌దులుతుండ‌డం, అత‌డి కాలు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో కింద ప‌డిపోబోయాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి రైల్వే పోలీసు ప‌రుగున వ‌చ్చి అతడిని ప్లాట్‌ఫాంపైకి లాగాడు. నిన్న మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. రైలు క‌దులుతోన్న స‌మ‌యంలో ఎక్కాల‌ని చూసిన వ్య‌క్తిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

More Telugu News